.వైసీపీని వీడి టీడీపీలో చేరిక.
..వైసీపీని వీడి టీడీపీలో చేరిక..
(యల్లనూరు జనచైతన్య న్యూస్)
..వైసీపీని వీడి టీడీపీలో చేరిక..
యల్లనూరు మండలం లోని నీర్జాంపల్లికి చెందిన సర్పంచ్ భర్త గోపాల్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలు బండారు శ్రావణి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.అదేవిధంగా వారందరికీ పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో భాగంగా నారా చంద్రబాబు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయనే ఉద్దేశంతో వైసీపీని వీడి టీడీపీ లో కి రావడం జరిగిందంటూ గోపాల్ తెలిపారు. అనంతరం బండారు శ్రావణి మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఫ్యాన్ తిరగడం ఆగిపోతుందన్నారు. ఇక వైసిపి పాలన పూర్తిగా విఫలమైందని వచ్చే ఎన్నికల్లో టిడిపి పసుపు జెండా ఎగురుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా టీడీపీ పార్టీ కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయమని ఇక ఫ్యాన్ ఆటలు సాగనివ్వమని వచ్చేది సైకిలే అని గుర్తు చేశారు.